APTF: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:24 AM
ఉద్యోగ, ఉపాధ్యా య సమస్యలను పరి ష్కరించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చే శారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పుట్టపర్తిలోని కలెక్టరే ట్ ఎదుట నిరసన కార్యక్రమం చేప ట్టారు. ఈ సందర్బంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు కోనంకి ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తిఅయినా ఇప్ప టివరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదన్నారు.
ఏపీటీఎఫ్ నాయకులు - కలెక్టరేట్ ఎదుట ధర్నా
కొత్తచెరువు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగ, ఉపాధ్యా య సమస్యలను పరి ష్కరించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చే శారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పుట్టపర్తిలోని కలెక్టరే ట్ ఎదుట నిరసన కార్యక్రమం చేప ట్టారు. ఈ సందర్బంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు కోనంకి ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తిఅయినా ఇప్ప టివరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే పెం డిగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చే యాలన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి, పీఆర్సీ కమిషనను నియమించాలన్నారు.
పీఆర్సీ అం దేంతవరకు 30 శాతం ఐఆర్ మంజూరు చే యాలని, ఈహెచఎస్ పరిమితి రూ.25 లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. దీర్గకాలి కంగా పెండింగులో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే విడుదలచేయాలన్నారు. పాఠశాలల్లో నూతనంగా ప్రవేశ పెట్టిన అసెస్‌మెంట్ బుక్ విధానాన్ని పునఃసమీక్షించాల న్నారు. యాప్‌ల భారాన్ని తగ్గించాలని, ఉపాధ్యాయులను విద్యా బోధనకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ్లఓ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్.చంద్ర, రాష్ట్ర నాయకులు ముత్యాలప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్ర రెడ్డి, బలరాముడు, జిల్లా కార్యదర్శి ఆది బయన్న నాయకులు రాజశేఖర్, హరిప్రసాద్, వెంకట నాయుడు, వెంకటరమణ, ఈశ్వరయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....