WIRES: కిందికి వేలాడుతున్న విద్యుత తీగలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:10 AM
మండల కేంద్రంలోని పాత పోస్టాఫీసు సమీ పంలో ఓ ఇంటి ఎదుటే 11 కేవీ విద్యుత తీగలు వేలాడుతున్నాయి. దీంతో ఆ ఇంటిలోకి వెళ్లాలంటే తీగల కింద నక్కినక్కి పో వాల్సి దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ర వీంద్ర అనే గ్రామస్థుడు ఆ ఇంటిలోనే చిల్లర అంగడి నిర్వహిస్తున్నారు.
చేతికి అందే ఎత్తులో విద్యుతతీగలు
కొత్తచెరువు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పాత పోస్టాఫీసు సమీ పంలో ఓ ఇంటి ఎదుటే 11 కేవీ విద్యుత తీగలు వేలాడుతున్నాయి. దీంతో ఆ ఇంటిలోకి వెళ్లాలంటే తీగల కింద నక్కినక్కి పో వాల్సి దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ర వీంద్ర అనే గ్రామస్థుడు ఆ ఇంటిలోనే చిల్లర అంగడి నిర్వహిస్తున్నారు. దీంతో రోజూ ఆ అంగడికి రోజూ సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు వస్తుంటారు. వారు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ విద్యుతతీగలు తగిలే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా వాటికి ప్లాస్టిక్ పైపులను ఏర్పాటు చేశారన్నారు. ఆ 11కేవీ తీగలను మార్చాలని పలుమార్లు విద్యుత సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప విద్యుతశాఖ అధికారులు స్ప్దందించరా అంటూ స్థానికులు పండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత తీగలను మార్చేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.