ELECTRICITY: ఇంట్లో విద్యుత షార్ట్ సర్క్యూట్
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:16 AM
మండలంలోని వెంకటాపురం(నల్లగుట్లపల్లి)గ్రామానికి చెందిన బీరే కరుణాకర్ నాయుడు స్వగృహంలో శనివారం అర్ధరాత్రి విద్యుతషాట్ సర్క్యూట్ అయింది. ఈ ప్రమాదంలో రూ. 3లక్షలు నష్టం వాటిల్లినట్లు బాఽధి తుడు వాపోయాడు. వెంకటాపురానికి చెందిన బీరే కరుణాకర్ నా యుడు, కుటుంబసభ్యులు ప్రతి రోజులాగానే శనివారం రాత్రి ఆరు బయట నిద్రించారు.
ఓబుళదేవరచెరువు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటాపురం(నల్లగుట్లపల్లి)గ్రామానికి చెందిన బీరే కరుణాకర్ నాయుడు స్వగృహంలో శనివారం అర్ధరాత్రి విద్యుతషాట్ సర్క్యూట్ అయింది. ఈ ప్రమాదంలో రూ. 3లక్షలు నష్టం వాటిల్లినట్లు బాఽధి తుడు వాపోయాడు. వెంకటాపురానికి చెందిన బీరే కరుణాకర్ నా యుడు, కుటుంబసభ్యులు ప్రతి రోజులాగానే శనివారం రాత్రి ఆరు బయట నిద్రించారు. ఇంట్లో వృద్ధులైన బాధితుడి తల్లిదండ్రులు నిద్రిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి ఫ్రిడ్జ్ వద్ద విద్యుత షార్ట్ సర్క్యూ ట్ అయి, ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన కరుణాకర్‌నాయుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను బయటికి తీసుకొ చ్చాడు. ఆ లోగా ఇంట్లోని బీరువా, తిండి గింజలు, బట్టలు, అన్ని కాలి బూడిదయ్యాయి. దీంతో కట్టుబట్టలతో మాత్రమే ఉండాల్సి వ చ్చిందని కరుణాకర్‌నాయుడు వాపోయాడు. అఽధికారులు, ప్రభు త్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....