STU: ఎస్టీయూ మండల కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:10 AM
తలుపుల మండలం ఓబుల రెడ్డిపల్లిలోని స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో గురువారం ఎస్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా విజయవర్ధన రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా హరిప్రసాద్‌రెడ్డి, మహిళా కన్వీనర్ పద్మజ, మైనార్టీ కన్వీనర్ తబ్రేజ్ బాషా, జిల్లా కౌన్సిలర్లుగా రమణానాయక్, మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కదిరి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): తలుపుల మండలం ఓబుల రెడ్డిపల్లిలోని స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో గురువారం ఎస్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా విజయవర్ధన రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా హరిప్రసాద్‌రెడ్డి, మహిళా కన్వీనర్ పద్మజ, మైనార్టీ కన్వీనర్ తబ్రేజ్ బాషా, జిల్లా కౌన్సిలర్లుగా రమణానాయక్, మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉపా ధ్యాయ సేవే ధ్యేయంగా పనిచేస్తామని, సంఘంలో నిబధ్దతగా, నిజా యితీగా ఉంటూ సంఘ ఉన్నతికి పాటుపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటరమణ, రాజశేఖర్‌రెడ్డి, ఎం. వెంకటరమణ, బాబా ఫక్రుద్దీన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....