EMPLOYEES: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:32 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిస్కారానికి ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశేషకృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పాలేల రామాంజినేయులు పేర్కొన్నారు. సంఘానికి గుర్తింపు వచ్చి ఆరేళ్లు పూర్తిచేసు కున్న సంధర్భంగా జిల్లాకేంద్రంలోని ఆంధ్రప్ర దేశ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శనివారం సంఘం జెండాను ఆవిష్కరించి కేక్‌కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
పుట్టపర్తి రూరల్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిస్కారానికి ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశేషకృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పాలేల రామాంజినేయులు పేర్కొన్నారు. సంఘానికి గుర్తింపు వచ్చి ఆరేళ్లు పూర్తిచేసు కున్న సంధర్భంగా జిల్లాకేంద్రంలోని ఆంధ్రప్ర దేశ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శనివారం సంఘం జెండాను ఆవిష్కరించి కేక్‌కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గ్రూప్-1 అధికారుల వరకు అన్ని కేడర్ల ఉద్యోగులు సంఘంలో కొనసా గుతున్నారన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలొచ్చినా సంఘం దృష్టికి తీసుకొచ్చినవెంటనే వాటిని పరిష్కరిస్తామ న్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోవిందప్ప, రవి, ముసలిరెడ్డి, సహయ కార్యదర్శి కిశోర్, వివిద తాలుకాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
డీఏలను వెంటనే ప్రకటించాలి
కదిరి అర్బన: ప్రభుత్వ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన మూ డు డేఏలను వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆది బయ్యన్న డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఎన్జీఓ కార్యాలయంలో ఏపీటీఎఫ్ సమా వేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టయేడాదిన్నర అయినా పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు. వెంటనే పీఆర్సీ కమిటీని ప్రకటించి, 30శాతం ఐఆర్‌ను ప్రకటించాలన్నారు. ఐదేళ్లుగా పెడింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు విడుదల చేయాలన్నారు. నాయకులు నారాయణ, జనార్ధన, పి.నారాయణ, భోజనం శ్రీనివాసులు, బండారు గంగాధర్, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....