Share News

MINISTER: ఆర్థిక... సామాజిక... కొత్తదశ

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:26 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయా లతో ధర్మవరం పట్టణం ఆర్థికంగా, సామాజికంగా కొత్తదశకు చేరుకుం టోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నా రు. ఆయన గురువారం స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో మెప్మా బృందంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ... గత వైసీపీ పాలనలో స్వయం సహాయక సంఘాలకు చాలా అ న్యాయం జరిగిందన్నారు.

MINISTER: ఆర్థిక... సామాజిక... కొత్తదశ

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌

ధర్మవరం, ఆగస్టు 28(ఆంరఽధజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయా లతో ధర్మవరం పట్టణం ఆర్థికంగా, సామాజికంగా కొత్తదశకు చేరుకుం టోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నా రు. ఆయన గురువారం స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో మెప్మా బృందంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ... గత వైసీపీ పాలనలో స్వయం సహాయక సంఘాలకు చాలా అ న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం తో ధర్మవరంలో స్వయం సహాయక సంఘాల కు రూ.113 కోట్లు రుణాలు మంజూరు చేయడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త దా రులు తెచిచారన్నారు. పట్టణంలోని 2488 స్వయం సహాయక సంఘాల స్థితిగతులపై, బ్యాంకు రుణాల పురోగతిపై మంత్రి సమీక్షించారు. 2019- 20 నుంచి ఇప్పటివరకు పట్టణంలోని సంఘాలకు మొత్తం రూ.325.47 కోట్ల రుణాలు మంజూరు కాగా, వాటిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు రూ. 113కోట్లు అందించడమే ప్రత్యేకత అన్నారు. సంఘాలు కూడా సమయానికి రుణాలను తిరిగి చెల్లించేలా కృషిచేయాలని సంబంఽ దిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలోని వీధి విక్రయదా రుల సంఖ్య, వారికి లభిస్తున్న పీఎం స్వానిధి పథకం ప్రయోజనాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 2986 మంది లబ్దిదారులకు రూ.58 లక్షలు రుణాలు మంజూరు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే పలు అంశాలపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌, మెప్మా పీడీ పద్మావతి, టీపీఓ విజయబాస్కర్‌, సీఎంఎం లక్ష్మీనారాయణ, ఆర్పీలు పాల్గొన్నారు.


సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ధర్మవరం: ప్రతి కుటుంబం ఆరోగ్యభద్రత తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. పట్ట ణంలోని ఎన్డీ ఏ కార్యాలయంలో ఽఆయన గురువారం నియోజకవర్గంలోని 58 మంది లబ్ధిదారులకు రూ. 55 లక్షల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్‌ చె క్కులను గురువారం మంత్రి పంపిణీచేశారు. అనంతరం ఆయన మాటా ్లడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమ న్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోం దన్నారు. అదేవిదంగా హంద్రీనీవా కాలువ ద్వారా ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల పరిధి లోని 17 చెరువులకు నీరు అందించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇంకా పలు గ్రామాల చెరువులను గుర్తించి, వాటిని నీటితో నింపేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, ఫ్యాక్షన భావజాలం నుంచి బయటపడుతూ మీ భవిష్యత్తును మరింత బలంగా నిర్మించుకోవాలని ఆయన సూచించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 29 , 2025 | 12:27 AM