ICDS: సమతుల ఆహారం తీసుకోవాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:41 AM
గర్భిణులు, బా లింతలు పోషకవిలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవా లని సీడీపీఓ జయంతి, మునిసిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రశాంతిగ్రాంలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడా, భేటీ బచావో- భేటీ పఢావో’ కార్యక్రమం నిర్వహించారు.
ఫ మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్
పుట్టపర్తి రూరల్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బా లింతలు పోషకవిలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవా లని సీడీపీఓ జయంతి, మునిసిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రశాంతిగ్రాంలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడా, భేటీ బచావో- భేటీ పఢావో’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ము నిసిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ... జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. స్థానికంగా ప్రకృతి సిద్ధంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యాలు, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు. సీడీపీఓ మాట్లాడుతూ సమతుల ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుందని సూచించారు. కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శి తులసి, ఏఎనఎంలు, ఆంగనవాడీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.