RDO: ప్రతి అర్జీని పరిష్కరించాలి: ఆర్డీఓ
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:26 PM
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ప్రతి అర్జీని విచారించి తక్షణమే పరిష్క రించాలని ఆర్డీఓ మహేశ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం ప్రజా సమస్య ల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆర్డీఓ నిర్వహించారు.

ధర్మవరం, జూన 30(ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ప్రతి అర్జీని విచారించి తక్షణమే పరిష్క రించాలని ఆర్డీఓ మహేశ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం ప్రజా సమస్య ల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆర్డీఓ నిర్వహించారు. ఈ సం దర్భంగా ధర్మవరం రెవిన్యూ డివిజన పరిధిలో ప్రజలు వారి సమ స్యలపై ఆర్డీఓకు అర్జీలు ఇచ్చుకున్నారు. ఽభూమి సర్వేకోసం ధర్మవ రం, తాడిమర్రి మండలాల నుంచి రెండు చొప్పున, కనగానపల్లి, , చెన్నేకొత్తపల్లి, ముదిగుబ్బ, రామగిరి మండలాల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. వీటిని ఆయా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆర్డీఓ సూచించారు. కార్యక్రమంలో అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.
మొహర్రం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ధర్మవరం(ఆంధ్రజ్యోతి): మొహర్రం వేడుకలను ప్రశాంత వా తావరణంలో జరుపుకోవాలని ఆర్డీఓ మహేశ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం మొహర్రం వేడుకలకు సంబం ధించి పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ... మొహర్రం సందర్భంగా తగిన భద్రతా చర్యలు, పారశుధ్యం, వైద్య సదుపా యాలు, తాగునీటి సరఫరా, రాత్రివేళ విద్యుత సరఫరా, అత్యవసర సేవలు వంటి ఏర్పాట్లపై అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి శాఖ సమ యానికి తమ సేవలు అందించాలన్నారు. ఊరేగింపు మార్గల్లో బలహీనమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు తీసు కోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవె న్యూ, ఎంపీడీఓ, పోలీస్, మున్సిపల్ అధికారులు, వైద్యాధికారులు, రూరల్ వాటర్ సప్లై, విద్యుత, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....