Share News

KGBV: విధులను బాధ్యతగా నిర్వర్తించాలి : జీసీడీఓ

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:50 PM

విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ట్ర యిల్‌ ఫోర్‌ కస్తూర్బా పాఠశాల(కేజీ బీవీ) సిబ్బందికి జీసీడీఓ అనిత సూచించారు. మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల వసతి గృహం లో విద్యార్థినులతో వంట పనులు, కూరగా యలు కోయడం, వాటర్‌ క్యానలు మోయించ డం వంటి పనులు చేయిస్తున్నారని, సోషల్‌ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నా యని జీసీడీఓ అన్నారు.

KGBV: విధులను బాధ్యతగా నిర్వర్తించాలి : జీసీడీఓ
GCDO Anita investigating the hostel staff

కేజీబీవీ వసతి గృహం తనిఖీ

గాండ్లపెంట, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ట్ర యిల్‌ ఫోర్‌ కస్తూర్బా పాఠశాల(కేజీ బీవీ) సిబ్బందికి జీసీడీఓ అనిత సూచించారు. మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల వసతి గృహం లో విద్యార్థినులతో వంట పనులు, కూరగా యలు కోయడం, వాటర్‌ క్యానలు మోయించ డం వంటి పనులు చేయిస్తున్నారని, సోషల్‌ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నా యని జీసీడీఓ అన్నారు. ఈ సందర్భంగా వసతి గృహం తనిఖీ చేప ట్టినట్లు తెలిపారు. వసతి గృహంలోని విద్యార్థినులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అలాగే వసతిగృహంలో విద్యార్థినులచే పను లు చేయిస్తున్నట్లు వైరల్‌ అవుతున్న దృశ్యాలపై విద్యార్థినులచే ఆరా తీశారు. హాస్టల్‌ ప్రారంభంలో సిబ్బంది లేక పోవడంతో సహాయం చేశామని విద్యా ర్థి నులు తెలిపారు. ప్రస్తుతం ఎవరూ త మతో పనులు చేయించడంలేదని జీసీడీఓ కు వివరించారు. అనంతరం మెనూ ప్ర కా రం భోజనాలపై ఆరా తీశారు. హాస్టల్‌ సి బ్బందితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లా డుతూ ప్రభుత్వం ఎవరికి కేటాయించిన పనులు వారే చేయాలని, వి ద్యార్థినులతో చేయించరాదని గట్టిగా హెచ్చరించారు. తీరు మారకపోతే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు కృష్ణా నాయక్‌, శ్రీనివాసులు, హెచఎం ప్రసాద్‌, హాస్టల్‌ వార్డెన జ్యోత్స్న పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 08 , 2025 | 11:50 PM