Share News

MEET: సమావేశానికి అధికారుల డుమ్మా

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:12 AM

మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చిందేందుకు మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం తాడిమర్రి మండలంలో అబాసుపాలవుతోంది. ఎంపీపీ పాటిల్‌ భువనేశ్వర్‌ ఆధ్యక్షతన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.

MEET: సమావేశానికి  అధికారుల డుమ్మా
MPP speaking in the meeting

తాడిమర్రి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చిందేందుకు మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం తాడిమర్రి మండలంలో అబాసుపాలవుతోంది. ఎంపీపీ పాటిల్‌ భువనేశ్వర్‌ ఆధ్యక్షతన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. ము ఖ్యంగా పీఏబీఆర్‌ కుడికాలువ ద్వారా నీరు వస్తున్న ప్రస్తుత తరుణంలో తగిన ప్రణాళిక తయారు చేసుకుని అనుమతి పొందాల్సిన మైనర్‌ ఇరిగేషన అధికారులు రాలేదు. వారికి తోడు వైద్యఆరోగ్యశాఖ, పశువైద్యశాఖ, ఆర్టీసీ, విద్యుతశాఖ అధికారులు కూడా హాజరు కా లేదు. మండలంలోని ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సిన మండల స్థాయి అధికారులు హాజరు కాకుండా వారి కిందస్థాయి సిబ్బందిని పంపారు. సార్‌ అందు బాటులో లేరు... వేరే పనిమీద గ్రామాలకు ఉన్నారంటూ వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మండల సర్వసభ్యసమావేశం నిర్వహించినా, నిర్వహించకపోయినా ఒకటేనని మిగిలిన ప్రజాప్రతినిధులు అనుకోవడం కనిపించింది. కాగా గురువారం జరిగిన సమావేశంలో పాల్గొన్న అధికారులు వారి శాఖల పరిధిలో గడచిన మూడు నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని రాబోవు మూడు నెలల కాలంలో చేపట్టబోయే పనుల గురించి వివరిం చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీలు, ఎంపీడీఓ రంగారావు, తహసీల్దార్‌ భాస్కర్‌రెడ్డి, ఎంఈఓ క్రిష్నమోహన, ఏఓ శేఖర్‌నాయక్‌, ఈఓఆర్‌డీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 12:12 AM