DSP Srinivasa Rao : డీఎస్పీ శ్రీనివాసరావుకు విశిష్ట సేవాపతకం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:46 AM
డీఎస్పీ శ్రీనివాసరావు విశిష్ట సేవాపథకానికి ఎంపికయ్యారు. అనంతపురం డీఎస్పీగా పనిచేస్తున్న ఆయన, శాంతి భద్రతల పరిరక్షణకు అందించిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియల్ సర్వీస్ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీనివాసరావు 1989లో ...
అనంతపురం క్రైం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): డీఎస్పీ శ్రీనివాసరావు విశిష్ట సేవాపథకానికి ఎంపికయ్యారు. అనంతపురం డీఎస్పీగా పనిచేస్తున్న ఆయన, శాంతి భద్రతల పరిరక్షణకు అందించిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియల్ సర్వీస్ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీనివాసరావు 1989లో ఎస్‌ఐగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో సీఐగా, 2014లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. నూజివీడు, కందుకూరు, చీరాల, విజయవాడ ఈస్ట్ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. గతంలో ఏపీ సేవా పతకం, ఏపీ ఉత్తమ సేవా పతకం, ఏపీ మహోన్నత సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకం అందుకున్నారు. తాజాగా విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. దీంతో ఎస్పీ జగదీష్, పలువురు పోలీసు అధికారులు ఆయనను అభినందించారు.