PLANTS: ఎండుతున్న మొక్కలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:46 PM
సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి చిత్రావతి సుందరీకరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటకనాగేపల్లి సత్యసాయి పార్క్ నుంచి దుర్గాదేవి ఆలయం వరకు దాతల సహకారంతో పూలమొక్కలను నాటారు. మొక్కలైతే నాటారు కాని వాటికి నీరు పోయడం మరిచిపోయారు. దీంతో ఆ మొక్కలు కాస్తా ఎండిపోతున్నాయి.
కనీసం 15 రోజులు కూడా
కాకనే సంరక్షణ వదిలేసిన అధికారులు
పుట్టపర్తి రూరల్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి చిత్రావతి సుందరీకరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటకనాగేపల్లి సత్యసాయి పార్క్ నుంచి దుర్గాదేవి ఆలయం వరకు దాతల సహకారంతో పూలమొక్కలను నాటారు. మొక్కలైతే నాటారు కాని వాటికి నీరు పోయడం మరిచిపోయారు. దీంతో ఆ మొక్కలు కాస్తా ఎండిపోతున్నాయి. పట్టుమని 15 రోజులు కూడా కాకనే అధికారులు మొక్కలను సంరక్షణను వదిలేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలే కదా అని వదిలేశారని ఎద్దేవ చేస్తున్నారు. పక్కనే చిత్రావతి నది నిండుగా నీరు ఉన్నా గట్టుమీద ఉన్న మొక్కలకు నీరుపో యకపోవడంతో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా దాతలు ఎంతో ఔదార్యంతో సహకరించి చిత్రావతి నది ఒడ్డున నాటిన మొక్కలను సంరక్షించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....