CRICKET: ఫైనల్స్‌కు చేరినడ్రాగన లెవెన, హిందూపురం హంటర్స్
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:04 AM
పట్టణంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నీ సీజన-2 సెమీఫైనల్ మ్యాచలు హోరాహోరీగా కొనసాగాయి. శనివా రం జరిగిన మొదటి మ్యాచలో డ్రాగన లెవెన్స జట్టు గొట్లూరు జట్లు తలబ డ్డాయి. డ్రాగనలెవెన్స జట్టు 12ఓవర్లలో 174పరుగులు సాధించింది. ప్రత్య ర్థిగా బరిలో దిగిన గొట్లూరు జట్టు 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది.
ధర్మవరం రూరల్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నీ సీజన-2 సెమీఫైనల్ మ్యాచలు హోరాహోరీగా కొనసాగాయి. శనివా రం జరిగిన మొదటి మ్యాచలో డ్రాగన లెవెన్స జట్టు గొట్లూరు జట్లు తలబ డ్డాయి. డ్రాగనలెవెన్స జట్టు 12ఓవర్లలో 174పరుగులు సాధించింది. ప్రత్య ర్థిగా బరిలో దిగిన గొట్లూరు జట్టు 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. దీంతో డ్రాగన లెవెన జట్టు 74పరుగులతో విజయం సాధించింది. రెండో సెమీఫైనల్ మ్యాచలో లక్ష్మీనరసింహ లెవెన్స జట్టు, హిందూపురం హంటర్స్ జట్టు తలబడ్డాయి. టాస్ గెలిచి బరిలో దిగిన లక్ష్మీనరసింహజట్టు 12ఓవర్లలో 4 వికెట్లుకు గాను 103 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు హిందూపురం హంటర్స్ జట్టు కేవలం 7ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో 108పరుగులు సాధించి ఘన విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ లలో విశేషప్రతిభ కనబరిచిన డ్రాగన లెవెన్స జట్టులో ప్రశాంతరెడ్డి, హిందూపురం హంటర్స్ జట్టులో అయాజ్‌కు మ్యాచఆఫ్‌ది మ్యాచ దక్కాయి. వీరికి బీజేపీ నియోజకవర్గ ఇనఛార్జ్ హరీష్‌బాబు, ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ హనుమంతప్ప, మార్కెట్‌యార్డు డైరెక్టర్ కొంకా నాగార్జున, కోచలు షీల్డులు అందజేసి అభినందనలు తెలిపారు. విజేతలైన రెండు జట్లు ఫైనల్స్ కు చేరుకున్నట్లు తెలిపారు. ఫైనల్ మ్యాచను ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....