POLICE: కుంటల వద్దకు పిల్లలను పంపొద్దు :డీఎస్పీ
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:58 PM
చిన్నపిల్లలు చెరు వులు, నీటికుంటల వద్దకు వెళ్లకుండా తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ విజయ్‌కుమార్ సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి మండల పరిధిలోని బత్తలపల్లిలో డీఎస్పీ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ... వర్షాకాలం నేపథ్యంలో ప్రతిచోట చెరువులు, నీటి కుంటలు నిండుగా ఉన్నాయన్నారు.
పుట్టపర్తి రూరల్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): చిన్నపిల్లలు చెరు వులు, నీటికుంటల వద్దకు వెళ్లకుండా తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ విజయ్‌కుమార్ సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి మండల పరిధిలోని బత్తలపల్లిలో డీఎస్పీ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ... వర్షాకాలం నేపథ్యంలో ప్రతిచోట చెరువులు, నీటి కుంటలు నిండుగా ఉన్నాయన్నారు. కావున చిన్నపిల్లలు చెరువు లు, నీటికుంటల వద్దకు వెళ్లకుండా తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పేకాట ఆడితే, గంజాయి, అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ క్రైం, చీటింగ్, మహిళలు, చిన్నారుల పట్ల నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అపరిచితుల కదిలికలపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ లింగన్న, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
బాలికలు అప్రమత్తంగా ఉండాలి
కదిరి: బాలికలు అప్రమత్తంగా ఉం డాలని, సమస్యలు ఎదురైన ప్పుడు నంబర్లు 100కు గానీ, 112కు గానీ ఫోన చేయాలని డీఎస్పీ శివనారాయణస్వామి సూచించారు. ఆయన బుధవారం స్థానిక బాలికల ఎస్టీ హాస్టల్, కళాశాల వి ద్యార్థినులతో సమావేశం నిర్వహించారు. గుడ్ టచ, బ్యాడ్ టచ గురించి వివరించారు. స్ర్తీ శక్తి టీం ఎప్పుడూ అందుబాటులో ఉం టుందన్నారు. హాస్టల్‌లో సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకరావలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, సెల్‌ఫోన వినియోగం తదితర విషయాలపై వివరించారు. పట్టణ సీఐ నారాయణరెడ్డి, పోలీస్ సిబ్బంది. హాస్టల్ వార్డెనలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....