ADA: సేంద్రియ ఎరువులను అమ్ముకోవద్దు : ఏడీఏ
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:37 AM
సేంద్రియ ఎరువుల ను పక్కరాష్ట్రాలకు విక్రయించకుండా, పొలాలకు వినియోగించుకోవాలని రైతులకు ఏడీఏ సనావుల్లా సూచించారు. మండలపరిధిలోని వెలిచెల మల, పడమర నడింపల్లిల్లో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏడీఏ మాట్లాడుతూ... సేంద్రియ ఎరువకులతో తక్కువ పెట్టుబడితో నాణ్య మైన పంటలు పండించవచ్చని తెలిపారు.
నంబులపూలకుంట, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): సేంద్రియ ఎరువుల ను పక్కరాష్ట్రాలకు విక్రయించకుండా, పొలాలకు వినియోగించుకోవాలని రైతులకు ఏడీఏ సనావుల్లా సూచించారు. మండలపరిధిలోని వెలిచెల మల, పడమర నడింపల్లిల్లో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏడీఏ మాట్లాడుతూ... సేంద్రియ ఎరువకులతో తక్కువ పెట్టుబడితో నాణ్య మైన పంటలు పండించవచ్చని తెలిపారు. ఏఓలు లోకేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఏఈఓ శిరీష, సిబ్బంది రాధ, నారాయణస్వామి రైతులు పాల్గొన్నారు.
నల్లమాడ: మండలంలోని అరవవాండ్లపల్లి తండాలో మంగళ వారం వ్యవసాయ విస్తరణాధికారి రంగచారి ఆధ్వర్యంలో పొలం పిలు స్తోంది కార్యక్రమం నిర్వహించారు. పంటలకు సేంద్రియ ఎరువులు వాడితే కలిగే లాభాలు, రసాయనిక ఎరువుల వల్ల నష్టాలను ఆయన వివరించారు. ఏఈఓలు, వీహెచఏలు, రైతులు పాల్గొన్నారు.
తనకల్లు : మండలంలోని గంగసానిపల్లిలో మంగళవారం వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిం చారు. రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అలాగే నానో యూరియా వాడాలని సూచించారు. వ్యవసాయాధికారి భారతి, ఐసీఆర్‌టీ శంకర్‌రెడ్డి, వేదవతి, గ్రామస్థులు పాల్గొన్నారు.