SP : లక్ష్యం సాధించే వరకూ విశ్రమించొద్దు
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:32 AM
విద్యార్థులు నిర్ధేశించుకున్న లక్ష్యం సాధించేవరకూ పట్టు వదలకుండా కృషి చేయాలని ఎస్పీ జగదీష్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స హాల్‌లో 2024-25 విద్యాఏడాదిలో 10వ తరగతి, ఇంటర్, ఎంటెక్, ఎంబీఏలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఎప్పీ మాట్లాడుతూ... పోలీసు ఉద్యోగుల పిల్లల్లో ప్రతిభను గుర్తిస్తూ మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్నామన్నారు. విద్యార్థులు..
విద్యార్థులకు ఎస్పీ జగదీష్ సూచన
పోలీసు పిల్లలకు ప్రతిభా పురస్కారాల ప్రదానం
అనంతపురం క్రైం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు నిర్ధేశించుకున్న లక్ష్యం సాధించేవరకూ పట్టు వదలకుండా కృషి చేయాలని ఎస్పీ జగదీష్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స హాల్‌లో 2024-25 విద్యాఏడాదిలో 10వ తరగతి, ఇంటర్, ఎంటెక్, ఎంబీఏలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఎప్పీ మాట్లాడుతూ... పోలీసు ఉద్యోగుల పిల్లల్లో ప్రతిభను గుర్తిస్తూ మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యం కోసం పట్టుదల, కృషితో ముందుకెళ్లాలన్నారు.
ఏ స్థాయికెళ్లినా తల్లిదండ్రులను మరువకూడదన్నారు. తర్వాత 107 మంది పోలీసు పిల్లలకు రూ.6.23 లక్షల మెరిట్ స్కాలర్‌షిప్ సొమ్ము అందించారు. ప్రోత్సాహక నగదు, ప్రశంసాపత్రాలతో వారిని అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ ఇలియాజ్ బాషా, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐలు ధరణీకిషోర్, దేవానంద, వంశీకృష్ణ, హరినాథ్, ఆర్‌ఐలు మధు, పవనకుమార్, రాముడు, పోలీసు అధికారుల సంఘం అడ్‌హక్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
(మరిన్ని అనంతపురం వార్తల కోసం..)