Tdp : లైనింగ్ వేయొద్దు సార్..!
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:52 AM
హంద్రీనీవా కాలువకు లైనింగ్ వేస్తే పంటలకు నీరందక నష్టపోతామని, సమస్యను పరిష్కరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి సిద్ధరాంపురం గ్రామస్థులు విన్నవించారు. వెలగపూడిలో మంత్రిని మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఒకప్పుడు చుక్కనీరు లేక ఇబ్బందులు పడ్డామని, హంద్రీనీవా నీరు రావడంతో చీనీ, మామిడి, అంజూర, దానిమ్మ పంటలు సాగు చేస్తున్నామని మంత్రికి వివరించారు. హంద్రీనీవా కాలువ...

మంత్రి నిమ్మలకు రైతుల వినతి
అనంతపురం/ఆత్మకూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువకు లైనింగ్ వేస్తే పంటలకు నీరందక నష్టపోతామని, సమస్యను పరిష్కరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి సిద్ధరాంపురం గ్రామస్థులు విన్నవించారు. వెలగపూడిలో మంత్రిని మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఒకప్పుడు చుక్కనీరు లేక ఇబ్బందులు పడ్డామని, హంద్రీనీవా నీరు రావడంతో చీనీ, మామిడి, అంజూర, దానిమ్మ పంటలు సాగు చేస్తున్నామని మంత్రికి వివరించారు. హంద్రీనీవా కాలువ 219 కి.మీ. నుంచి 223 కి.మీ. వరకూ తమ భూములు ఉన్నాయని తెలిపారు. ఆ 4
కి.మీ. పరిధిలో అక్కడక్కడ లైనింగ్ వేయవద్దని విన్నవించారు. అలా కుదరకపోతే అకక్కడక్కడ ఖాళీగా వదిలినా భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. కాలువకు రెండు వైపులా లైనింగ్ వేసి, ఫ్లోరింగ్ వేయకుండా వదిలేసినా తమ సమస్య పరిష్కారమౌతుందని అన్నారు. రంగంపేట నుంచి తూముచెర్ల వరకూ ఉన్న రహదారిపై కాలువలో నీరు ఉంటే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, కాలువపై వంతెన నిర్మించాలని కోరారు. అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో టీడీపీ కనగానపల్లి మండల కన్వీనర్ యాతం పోతులయ్య, క్లస్టర్ ఇనచార్జి సుధాకర్ చౌదరి, సర్పంచ సోమర చంద్రశేఖర్, హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి శశాంక చౌదరి తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....