YOGA: యోగా చేయండి - ఆరోగ్యంగా ఉండండి
ABN , Publish Date - May 28 , 2025 | 12:03 AM
యోగాతోనే సంపూర్ణ ఆరో గ్యం సాధ్యమని యోగాంధ్ర క్యాంపెయిన నోడల్ ఆఫీసర్ డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. యోగాంధ్ర క్యాంపియనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం తరఫున బారీ అవ గాహన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీని డీఎంహెచఓ ప్రారంభించారు.
- నోడల్ అధికారి డీఎంహెచఓ ఈబీ దేవి పిలుపు
- జిల్లా కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ
అనంతపురం టౌన, మే 27( ఆంధ్రజ్యోతి): యోగాతోనే సంపూర్ణ ఆరో గ్యం సాధ్యమని యోగాంధ్ర క్యాంపెయిన నోడల్ ఆఫీసర్ డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. యోగాంధ్ర క్యాంపియనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం తరఫున బారీ అవ గాహన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీని డీఎంహెచఓ ప్రారంభించారు. అక్కడి నుంచి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్ మీదుగా తిరిగి ఆర్ట్స్ కళాశాల వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్బంగా డీఎంహెచఓ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మే రకు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల జూన 21 వరకు జిల్లా వ్యాప్తంగా యోగా శిక్షణా తరగతులను ఏర్పాటు చేశామ న్నారు. కార్యక్రమంలో ఆయుష్ జిల్లా అధికారి డాక్టర్ రాంకుమార్, డాక్టర్ లాల్యానాయక్, ఎనసీడీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నారాయణస్వామి, యోగా గురువులు గురురాజారావు, కృష్ణవేణి, చలపతి, డీపీఆర్‌ఓ గురుస్వామి శెట్టి, డెమోలు త్యాగరాజు, గంగాధర్, కిరణ్, ఐఎంఏ నాయకులు డాక్టర్ మురళీక్రిష్ణ, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మజతో పాటు పెద్దఎత్తున ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....