GAMES: మూడో రోజు కొనసాగిన డివిజన స్థాయి క్రీడలు
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:41 AM
స్థానిక ఎస్‌టీఎస్‌ఎన డిగ్రీ కళాశాలలో శుక్రవారం మూడో రోజు ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ -14, 17 బాల బాలికల క్రీడల పోటీలు కొనసాగా యి. ఇందులో హైజంప్, లాంగ్ జంప్, 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగుపందెంతో పాటు డిస్క్ త్రో, షాట్‌పుట్, జావ్లింగ్ త్రో సంబంధిత క్రీడల పోటీలు నిర్వహించారు.
కదిరి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎస్‌టీఎస్‌ఎన డిగ్రీ కళాశాలలో శుక్రవారం మూడో రోజు ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ -14, 17 బాల బాలికల క్రీడల పోటీలు కొనసాగా యి. ఇందులో హైజంప్, లాంగ్ జంప్, 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగుపందెంతో పాటు డిస్క్ త్రో, షాట్‌పుట్, జావ్లింగ్ త్రో సంబంధిత క్రీడల పోటీలు నిర్వహించారు. వాటిలో ప్రథమ, ద్వితీయ స్థాయి ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపుతున్నామని డివిజన కోఆర్డినేటర్ లస్కర్‌నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ వెంకటాచలాన్ని వివిధ మండలాల పాఠశాలల పీడీలు సన్మానించారు.