Share News

UREA: యూరియా పంపిణీ

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:04 AM

మండలపరిధిలోని మల్లమీదపల్లి రైతు సేవా కేంద్రాంలో యూరియా పంపిణీ చేసిన ట్లు వ్యవసాయాధికారి షాదాబ్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మల్లమీదపల్లి పంచాయతీలో వరి పంట సాగ చేసిన రైతుల కోసం 6.3 టన్నుల (140 బస్తాలు) యూరియా రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉందని, కావలసిన రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం తెచ్చి తీసుకె ళ్లాలన్నారు.

UREA: యూరియా పంపిణీ
Officials distributing urea in Gandlapenta

గాండ్లపెంట, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని మల్లమీదపల్లి రైతు సేవా కేంద్రాంలో యూరియా పంపిణీ చేసిన ట్లు వ్యవసాయాధికారి షాదాబ్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మల్లమీదపల్లి పంచాయతీలో వరి పంట సాగ చేసిన రైతుల కోసం 6.3 టన్నుల (140 బస్తాలు) యూరియా రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉందని, కావలసిన రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం తెచ్చి తీసుకె ళ్లాలన్నారు. అలాగే పలు ఎరువుల దుకాణాలను తహసీల్దార్‌ బాబురావు, వ్యవసాయా ధికా రులు తనిఖీ చేశామన్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ కొండయ్య, ఈశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వ్యవసాయాఽధికారులు పాల్గొన్నారు.

నల్లమాడ: మండలకేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో శని వారం రైతులకు టోకెన పద్ధతిలో యూరియా పంపిణీ చేసినట్లు ఏఓ మహమ్మద్‌ హక్‌ తెలిపారు. యూరియా కావలసిన రైతులకు టోకెన పద్ధతిలో అందజేస్తామన్నారు. ముఖ్యంగా వరి, మొక్క జొ న్న సాగుచేసిన రైతులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అలాగే యూ రియా నిల్వ ఉన్న గదిని తహసీల్దార్‌ రంగనాయకులు పరిశీ లిం చారు. ఈ పంపీణీలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులున్నారు.

Updated Date - Sep 07 , 2025 | 12:04 AM