Share News

RDO: రైతులకు పండ్ల మొక్కల పంపిణీ

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:03 AM

మండల పరిఽధిలోని కటారుక్రాస్‌లోని రెడ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, వ్యవసాయ శాఖ ఏడీ సనావుల్లా ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాయలసీమలోని మెట్ట ప్రాంతం పండ్ల మొ క్కల సాగు అనుకూలమని రెడ్స్‌ సంస్థ రైతులకు ఉచితంగా అంది స్తోందని తెలిపారు.

RDO: రైతులకు పండ్ల మొక్కల పంపిణీ
RDO VVS Sharma giving fruit plants to farmers

గాండ్లపెంట, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండల పరిఽధిలోని కటారుక్రాస్‌లోని రెడ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, వ్యవసాయ శాఖ ఏడీ సనావుల్లా ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాయలసీమలోని మెట్ట ప్రాంతం పండ్ల మొ క్కల సాగు అనుకూలమని రెడ్స్‌ సంస్థ రైతులకు ఉచితంగా అంది స్తోందని తెలిపారు. రైతులకు నాలుగేళ్ల నుంచి నాలుగు లక్షల మొ క్కలు పంపిణీ చేసినట్లు రెడ్స్‌ సంస్థ డైరెక్టర్‌ బానూజ తెలిపారు. అలాగే పండ్లమొక్కల పెంపకంపై సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన రైతులకు పండ్ల మొక్కలను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి షాదాబ్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:03 AM