PHONES: అంగనవాడీలకు 5జీ ఫోన్ల పంపిణీ
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:07 AM
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అంగనవాడీ వ్యవస్థను తిరిగి మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరి టాలశ్రీరామ్ అన్నారు. ఆయన గురువారం పట్టణంలోని 230 మంది అంగనవాడీ కార్యకర్తలకు, ఎనిమిది మంది సూపర్‌వైజర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన 5జీ మొబైల్ ఫోన్లను పట్టణంలోని ఎర్రంగుంట టీడీపీ కా ర్యాలయంలో అందజేశారు.
ధర్మవరం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అంగనవాడీ వ్యవస్థను తిరిగి మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరి టాలశ్రీరామ్ అన్నారు. ఆయన గురువారం పట్టణంలోని 230 మంది అంగనవాడీ కార్యకర్తలకు, ఎనిమిది మంది సూపర్‌వైజర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన 5జీ మొబైల్ ఫోన్లను పట్టణంలోని ఎర్రంగుంట టీడీపీ కా ర్యాలయంలో అందజేశారు. టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, చింతలపల్లి మహేశచౌదరి, పరిశే సుధాకర్, ఫణికుమార్, నాగూర్‌హు స్సేన, సంధారాఘవ, భీమనేని ప్రసాద్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : స్థానిక ఐసీడీఎస్ ప్రాజక్టు పరిధిలోని అంగనవాడీ కార్యకర్తలకు గురువారం ధర్మవరంలోని మంత్రి కార్యాలయంలో ఆ కార్యాలయ ఇనచార్జ్ హరీష్‌బాబు 5జీ సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా 35 మంది మినీ అంగనవాడీలకు అప్‌గ్రేడ్ చేసిన నియమక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సరస్వతి, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....