DRAINAGE: అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:34 PM
మండలపరిధిలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మురు గునీటి కాలువల్లో నీరు పారలేక రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డంతా దుర్వాస వెదజల్లుతోందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామాల్లో ప్రధాన రహదారులపై పారుతున్న మురుగునీటిలో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని ఆయా గ్రామస్థులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై పారుతున్న మురుగునీరు
దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న గ్రామీణులు
ధర్మవరం రూరల్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మురు గునీటి కాలువల్లో నీరు పారలేక రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డంతా దుర్వాస వెదజల్లుతోందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామాల్లో ప్రధాన రహదారులపై పారుతున్న మురుగునీటిలో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని ఆయా గ్రామస్థులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మల్లాకాల్వ ఎస్సీకాలనీకి వెళ్లే రహదారిలో రోడ్డుపై మురుగునీరు పారుతోంది. అలాగే దర్శినమల బీసీకాలనీలో రోడ్డుపై మురుగు నీరు నిలిచింది. గొట్లూరులో డ్రైనేజీ కాలువలు పిచ్చమొక్కలతో పూడికపోయాయు. తుంపర్తి గ్రామంలో ఆర్డీటీ పాఠశాల వద్ద డ్రైనేజీ కాలువలో మట్టి కూరుకుపోయి
మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అదేవిధంగా ఆయా గ్రామాల్లో తా గు నీటి కొళాయిల వద్ద మురుగునీరు నిలిచి నీరంతా కలుషితంగా వ స్తున్నాయని వాపోతున్నారు. డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు ఎక్క డిక్కడ నిలిచిపోవడంతో దుర్వాసనతో పాటు దోమల ఉత్పత్తితో అలా ్లడుతున్నామని, రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. దోమలతో విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల్లో మౌళిక వసతులు లేకపోవ డంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మండల అధికారులు మాత్రం తమ కార్యాలయాలకు పరిమితమయ్యారని ప్రజలు మండిపడుతు న్నా రు. పలు గ్రామాల ప్రజలు మండల అధికారులకు సమస్యలపై విన్న వించినా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మౌళిక వసతుల కరువు
కూటమి ప్రభుత్వం రాగానే గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రజలు రోగాల బారిన పడకుండా పరిశుభ్రం చేయాలని, ప్రతి శనివారం స్వచ్ఛతే సేవ వంటి కార్యక్రమాలు నిర్వహి స్తోంది. ముఖ్యంగా పారిశుధ్యంపై చర్యలు చేపట్టేందుకు గ్రీన అంబా సిడర్లుకు ప్రతినెలా వేతనాలు అందిస్తోంది. కూటమి ప్రభుత్వం రాగానే పంచాయతీలకు నిధులు విడుదల చేస్తోంది. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, 15వ ఆర్థిక సం ఘం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో కనీసం గ్రామాల్లో పా రిశుధ్యం పనులు చేపట్టాలి. వీధిలైట్లు, తాగునీటి ఏర్పాట్లు, తాగునీటి కొ ళాయిల వద్ద అపరిశుభ్రత తొలగింపు, ట్యాంకులు పరిశుభ్రం చేయడం వంటి కార్యక్రమాలకు వినియోగిం చుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే గ్రామాల్లో అపరిశుభ్రత ఉండటంతో నిధులు ఏమయ్యాయని పలు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా గ్రామాల్లో మాత్రం పనులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
చర్యలు చేపడుతున్నాం - వెంకటేష్, డిప్యూటీ ఎంపీడీఓ, ధర్మవరం
గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపడుతు న్నాం. ఇప్పటికే పలు గ్రా మాల్లో పరిశుభ్రంగా ఉం డేట్లు చేయించాం. ఇంకా మిగిలిన గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. అ న్ని గ్రామాల్లో పారిశు ధ్యంపై చర్యలు తీసుకో వాలని పంచాయతీ కార్య దర్శులకు ఆదేశాలు ఇ చ్చాం. ప్రజలకు ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....