Share News

OFFICE: అపరిశుభ్రంగా...

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:44 PM

పట్టణంలోని ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయం ఆధ్వానంగా తయారయింది. నూతన భవనాలు కట్టించే ఆ శాఖ కార్యాలయంలో బూజుపట్టిన గదులు, ఆధ్వానంగా మరుగుదొడ్లు, ఆవరణం చుట్టూ పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, అపరిశుభ్రత రాజ్యమేలుతున్నాయి. వర్షం వస్తే కార్యాలయంలోని గదులు కారుతున్నా యి.

OFFICE: అపరిశుభ్రంగా...
Weeds and garbage around the office

ఆర్‌ అండ్‌ బీ ఈఈ కార్యాలయం

చుట్టూ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం

పట్టించుకోని అధికారులు

ధర్మవరం రూరల్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయం ఆధ్వానంగా తయారయింది. నూతన భవనాలు కట్టించే ఆ శాఖ కార్యాలయంలో బూజుపట్టిన గదులు, ఆధ్వానంగా మరుగుదొడ్లు, ఆవరణం చుట్టూ పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, అపరిశుభ్రత రాజ్యమేలుతున్నాయి. వర్షం వస్తే కార్యాలయంలోని గదులు కారుతున్నా యి. డివిజన పరిధిలోని ఈ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌తో పా టు సాంకేతిక విభాగం, సూపరింటెండెంట్‌, కార్యాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రభుత్వ భవనాలను ఆ శాఖ అధికారులే పనులు చేప ట్టి నిర్మిస్తుంటారు. అలాంటిది ఆ అధికారుల కార్యాలయమే ఆధ్వానస్థితికి చేరింది. కార్యాలయం సమీపంలోనే ఆర్‌అండ్‌బీ బంగ్లా ఉంది. చెత్తా చెదారంతో పాములు, విషపురుగుల సంచరించే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. మరుగుదొడ్ల తలుపులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. పైకి కార్యాలయం రం గులతో కనిపించినా లోపల ఆధ్వానం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు ఇక్కడ వర్తించవా అంటూ పలువురు పేర్కొంటున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 01 , 2025 | 11:44 PM