OFFICES: పెచ్చులూడుతున్న కార్యాలయాలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:46 PM
వర్షం వస్తే చాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితే మారిపోతుంది. ఏగదిలో చూసినా వర్షంపు నీరు కారుతోంది. ఇలా అయితే కార్యాలయంలో రికార్డులను ఎలా భద్రపరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మండలంలో ఏడువేల ఎకరాలను సోలార్‌కు ఇచ్చారని, సోలార్ ద్వారా వచ్చే సీఎ్‌సఆర్ నిధులతో నూతనంగా తహసీల్దార్‌భవనం నిర్మించాలని ప్రజ లు కోరుతున్నారు.
- వర్షం వస్తే నీరు కారుతున్న గదులు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు
నంబులపూలకుంట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వర్షం వస్తే చాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితే మారిపోతుంది. ఏగదిలో చూసినా వర్షంపు నీరు కారుతోంది. ఇలా అయితే కార్యాలయంలో రికార్డులను ఎలా భద్రపరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మండలంలో ఏడువేల ఎకరాలను సోలార్‌కు ఇచ్చారని, సోలార్ ద్వారా వచ్చే సీఎ్‌సఆర్ నిధులతో నూతనంగా తహసీల్దార్‌భవనం నిర్మించాలని ప్రజ లు కోరుతున్నారు. రూ. 9కోట్లుకు పైగా సీఎ్‌సఆర్ నిధులున్నాయని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన వాటని నూతనంగా నిర్మించాలని పార్టీలు, సంఘాల నాయకులు కోరుతున్నారు. అదేవిధంగా వరదనీటి ఉధృతికి తహసీల్దార్ కార్యాలయం వెనుక భాగంలో ప్రహరీగోడ పూర్తిగా కూలిపోయింది. దీంతో కార్యాలయం ఆవరణంలో పశువులు, విషసర్పాలు సంచారం ఎక్కువగా ఉంటోందని కార్యాలయంలోకి ప్రజలు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నట్లు ప్రజలు వాపోతన్నారు.
రికార్డులు భద్రపరిచిన గదిలోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని ప్రజలంటున్నారు. దీనిపై తహసీల్దార్ దేవేంద్రనాయక్ వివరణ వివరణ కోరగా.. కార్యాలయం దుస్థితి ఏపీ సోలార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీఎ్‌సఆర్ నిధులతో భవనం మరమ్మతులు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.
నల్లచెరువు: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పైకప్పు పె చ్చులు ఊడి కిందకు పడుతున్నాయి. పురాతన భవనం కావడంతో తహసీల్దార్ కార్యాలయ సి బ్బందితో పాటు ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రీవెన్సకు వచ్చే అధికారులు, తమ సమస్యలు పరిష్కారం కోసం వచ్చే రైతులు పెచ్చులు ఊడుతున్న పైకప్పు చూసి ఎప్పుడు మీద పడుతుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ కార్యాలయంలో కనీసం మరమ్మతులకు కూడా చేయలేదు. ఇప్పటికైనా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కార్యాలయానికి వచ్చే ప్రజలు, అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....