DHARNA: తాగునీటి కోసం ధర్నా
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:41 AM
మండల కేంద్రంలోని బసవన్న కట్ట వీధి, పెద్దమసీదు ప్రాంతాల్లో 15 రోజుల నుంచి తాగునీరు సరఫరా కాలేదం టూ ఆ ప్రాంత మహిళలు సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ధ ర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.... తమ ప్రాంతానికి 15 రోజలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తచెరువు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని బసవన్న కట్ట వీధి, పెద్దమసీదు ప్రాంతాల్లో 15 రోజుల నుంచి తాగునీరు సరఫరా కాలేదం టూ ఆ ప్రాంత మహిళలు సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ధ ర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.... తమ ప్రాంతానికి 15 రోజలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రూ.800 చె ల్లించి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నామన్నారు. వారానికి ట్యాంకర్ నీరు కావాలంటే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, వచ్చిన డబ్బులను నీటికే చెల్లిస్తే కుటుంబాలు ఎలా గడుస్తాయని వారు పంచాయతీ అధికారుల ను ప్రశ్నించారు. నీటి సమస్యను పరిష్కరించాలని పలు మార్లు సర్పంచకు, అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. దీంతో చేసేదిలేక ధర్నాకు దిగామని వారు తెలిపారు.
కాలనీల్లో మురుగు కాలువలను కూడా శుభ్రంచేయకపోవడంతో ఆ నీరంతా రోడ్లపై ప్రవహిస్తోందన్నారు. అది దుర్వాసన వెదజల్లుతోందన్నారు. అసలే వర్షాకాలం కాలువలను కూడా శుభ్రపరచకపోతే తాము ఇళ్లలో ఎలా ఉండాలని వారు ప్రశ్నించారు.