SPORTS: జిల్లా స్థాయికి ధర్మవరం ఉపాధ్యాయ జట్లు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:30 AM
ప్రభుత్వ ఉపాధ్యా యుల మానసిక ఉల్లాసం కోసమే రాష్ట్ర ప్రభుత్వం క్రీడాపోటీలు నిర్వ హించిందని ఽఎంఈఓ గోపాల్‌నాయక్ తెలిపారు. పట్టణంలోని తారక రామాపురం వద్ద ఉన్న ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న డివిజనస్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయ క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి.
ధర్మవరం రూరల్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యా యుల మానసిక ఉల్లాసం కోసమే రాష్ట్ర ప్రభుత్వం క్రీడాపోటీలు నిర్వ హించిందని ఽఎంఈఓ గోపాల్‌నాయక్ తెలిపారు. పట్టణంలోని తారక రామాపురం వద్ద ఉన్న ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న డివిజనస్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయ క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి. క్రికెట్ ఫైనల్స్ పురుషుల ఉపాధ్యాయుల విభాగంలో ధర్మవరం, తాడిమర్రి జట్లు తలపడ్డాయి. ధర్మవరం జట్టు ఒక వికెట్‌నష్టానికి 60పరుగులు ఛేదించి విజేతగా నిలిచింది. త్రోబాల్‌లో ధర్మవరం మహిళల జట్టు వి జేతగా నిలిచింది. దీంతో ఇరుజట్లను జిల్లాస్థాయి పోటీలకు పంపుతు న్నట్లు ఎంఈఓ తెలిపారు. విజేతలకు షీల్డ్స్, మెమొంటో, బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఇన్నర్‌వీల్ ఎనజీఓ భోజన వసతి కల్పించిందని వారికి విద్యాశాఖ తరఫున ఎంఈఓ ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు రాజేశ్వరి, రమణప్ప, కృష్ణమోహన, వెంకటేష్, జడ్పీపాఠశాల హెచఎం సుగుణ, మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ స్వరూప, ఎస్‌జీఎఫ్ అసోషియేషన సెక్రటరీ లక్ష్మీనారాయణ, ఇన్నర్‌వీల్ ఎనజీఓ ట్రెజరర్ రాజేశ్వరి, నాగరత్నమ్మ, పీడీ అసోషియేన సెక్రటరీ అంజన్న తదితరులు పాల్గొన్నారు.