GAMES: రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:55 PM
రాష్ట్రస్థాయి బా స్కెట్‌బాల్ పోటీలకు ధర్మవరం బాల బాలి కలు ఎంపికైనట్లు ఉ మ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోషియేషన సెక్రటరీ శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం ధర్మవరంలో మాట్లా డుతూ... అనంతపురంలోని ఇండోర్‌స్టేడియంలో గత నెల 20న నిర్వహించిన ఎంపిక పోటీలు నిర్వహించారని తెలిపారు.
ధర్మవరం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి బా స్కెట్‌బాల్ పోటీలకు ధర్మవరం బాల బాలి కలు ఎంపికైనట్లు ఉ మ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోషియేషన సెక్రటరీ శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం ధర్మవరంలో మాట్లా డుతూ... అనంతపురంలోని ఇండోర్‌స్టేడియంలో గత నెల 20న నిర్వహించిన ఎంపిక పోటీలు నిర్వహించారని తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్టు తరపున రాష్ట్ర స్థాయి పోటీలకు ధర్మవరానికి చెందిన బాలికల విభాగంలో కిరణ్మయి, నీఖ్యశ్రీ, యశస్విని, అంజన, బాలుర విభాగంలో విజయ్‌తరుణ్, లక్ష్మీనరసింహలు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. వారు గురువారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే ఎనిమిదో ఆంధ్రప్రదేశ జూనియర్ అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఆ క్రీడాకారులను శెట్టిపి జయచంద్రారెడ్డితో పాటు ధర్మాంబ బాస్కెట్‌బాల్ అసోసియేషన పట్టణ అధ్యక్షుడు మేడా పురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్‌తుల్లా, కోచ సంజయ్, పీఈటీ నాగేంద్ర అభినందించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....