GOD: నారసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:39 AM
పట్టణంలోని ఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు శనివారం కావడంతో జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు. అలాగే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో వి ద్యార్థులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
కదిరి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు శనివారం కావడంతో జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు. అలాగే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో వి ద్యార్థులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శుక్రవారం రాత్రి నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అలాగే భక్తులు ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజే యడంతో పాటు ఆలయ అధికారులు అన్నదానం నిర్వహించారు.