MLA: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:16 AM
మునిసిపాలిటీలో జరుగు తున్న అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేసి సత్యసాయిబాబా శతజ యంతి వేడుకల నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి శుక్రవారం మునిసిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్, డీఈ నరసింహమూర్తి ఇతర ఇంజనీర్లతో కలసి పరిశీలించారు.
అధికారులకు ఎమ్మెల్యే సింధూరరెడ్డి ఆదేశం
పుట్టపర్తిరూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో జరుగు తున్న అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేసి సత్యసాయిబాబా శతజ యంతి వేడుకల నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి శుక్రవారం మునిసిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్, డీఈ నరసింహమూర్తి ఇతర ఇంజనీర్లతో కలసి పరిశీలించారు. అలాగే జాయ్‌లుకాస్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులు రూ. 1. 20 కోట్ల వ్యయంతో జరుగుతున్న పార్క్ స్నాన ఘాట్ పనులను పరిశీలించారు. నవంబరు 10నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణాన్ని శుభ్రంగా, సుందరీకరణతో ఆదర్శం గా తీర్చితిద్దాలని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మునిసిపల్ మాజీ చైర్మన బెస్త చలపతి, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, కరణం సుబ్రహ్మణ్యం, షామీర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....