TDP: కూటమి పాలనతోనే మైనార్టీల అభివృద్ధి
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:43 AM
ముస్లిం మైనార్టీలకు మంచి చేసింది, చేసేది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇమామ్, మౌజనలకు వేత నాలు చెల్లించడంతో ఆయన శనివారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో ధర్మవరం ముస్లింలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
పరిటాల శ్రీరామ్
ధర్మవరం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ముస్లిం మైనార్టీలకు మంచి చేసింది, చేసేది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇమామ్, మౌజనలకు వేత నాలు చెల్లించడంతో ఆయన శనివారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో ధర్మవరం ముస్లింలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షు డు పరిశే సుధాకర్, నాయకులు మాధవరెడ్డి, చట్టా లక్ష్మీనారాయణ, గవ్వల నారాయణస్వామి, ముస్లిం నాయకులు నాగూర్‌హుస్సేన, రాళ్లపల్లి షరీఫ్, రాళ్లపల్లి బాబు, అస్లాం, రావుల చెరువు కుళ్లాయప్ప, షామీర్, ఆజాద్, మాబు పాల్గొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలను దూదేకులకు అందే లా చూడాలని నూర్‌బాషా దూదేకుల సంఘం రాష్ట్ర కార్పొ రేషన డైరెక్టర్ రాళ్లపల్లి షరీఫ్‌కు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీ రామ్ సూచిం చారు. నూర్‌బాషా దూదేకుల సంఘం రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్‌గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ధర్మవరానికి చెందిన రాళ్లపల్లి షరీఫ్ ముస్లింలతో కలిసి పరిటాల శ్రీరామ్‌ను అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో సత్కరించారు. దూదేకుల్లో చాలా మందిపేదలున్నారని, అలాంటి వారిని గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందేలా చూడాలని రాళ్లపల్లి షరీఫ్‌కు శ్రీరామ్ సూచించారు. దూదేకుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషిస్తానని షరీఫ్ తెలియజేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....