MLA: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:11 AM
అభివృద్ధి, సంక్షేమం డబుల్ ఇం జన సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొ న్నారు. అలాగే ముందుకెళ్తున్నా మని అన్నారు. మండలపరిధిలోని కౌలేపల్లి వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబీ)ని ఆ యన శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో ఎన్డీఎ పాలనలో రెండు ఆర్వోడీలు మంజూరయ్యాయని, వా టిని పూర్తి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఎమ్మెల్యే కందికుంట
కదిరి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం డబుల్ ఇం జన సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొ న్నారు. అలాగే ముందుకెళ్తున్నా మని అన్నారు. మండలపరిధిలోని కౌలేపల్లి వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబీ)ని ఆ యన శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో ఎన్డీఎ పాలనలో రెండు ఆర్వోడీలు మంజూరయ్యాయని, వా టిని పూర్తి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ 18నెలల కాలంలో తాము భూ యజమానులతో పలుమార్లు చర్చించి, ఒప్పించామన్నారు.
ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతోపాటు, తాము కూ డా కొంత రైతులకు సాయం చేసి, భూ సమస్యను పరిష్కరించా మన్నారు. కుటాగుళ్ల వద్ద ఉన్న ఆర్వోబీ నిర్మాణానికి వైసీపీ నాయకులు ఇబ్బందులు కలిగిస్తున్నారని, అయినా వాటన్నింటిని పరిష్కరించి, త్వ రలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు క్రిష్ణ మోహన, స్వచ్చంధా కార్పొరేషన డైరెక్టర్ ఫర్వీనాబాను, టీడీపీ నా యకులు బాహుద్దీన, ఇస్మాయిల్, తాతా శీనా, రాజశేఖర్‌బాబు, మహ బూబ్‌బాషా, రమణమ్మ, ప్రేమలత, ఉమాదేవి, క్రిష్ సంస్థ ప్రతినిధులు, పిఆర్‌గ్రాండ్ యజమాని గణేష్, ఓరాతి చంద్ర, పతి, మాబూ, ప్రకాష్, ఈశ్వర్, రాజశేఖర్, మనోహర్, నాయకులు, కార్యకర్తలున్నారు.
ఎమ్మెల్యే ప్రజాదర్బార్
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలవద్దకే వస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. తలుపుల మండల పరిధిలోని కుర్లి సచివాలయం పరిధిలో శనివారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ప్రజలందరూ పనిచేసే ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.
ప్రజాదర్బార్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 114 ఆర్జీలు వచ్చా యని ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీడీఓ నజీమా, ఇనచార్జ్ తహసీల్దార్ రవి, టీడీపీ నాయకులు ముబారక్, శ్యామ్‌సుందర్, ఓబులరెడ్డి, మేడా శంకర్, గంగరాజు, ఎద్దుల క్రిష్ణమూర్తి, నాయకులు, కార్యకర్తలున్నారు.
భూమి పూజ
నల్లచెరువు: మండల పరిధిలోని పంతులచెరువు గ్రామంలో రూ. 32లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మండల పరిధిలోని బాలేపల్లికి తండా, పంతులచెరువుకు రెండు పంచాయతీ భవనాలు మంజూరైనట్లు తెలిపారు. తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీఓ అశోక్‌కు మార్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ రాజశేఖర్‌బాబు, నాయకులు అబ్దుల్ ఖాదర్, మాబుసాబ్,నాగభూషణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....