OFFICE: సమస్యల పరిష్కారంలో జాప్యం
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:07 AM
స్థానిక త హసీల్దార్ కార్యాలయంలో ప్రజల సమస్యలు కుప్పలు తెప్పలుగా అపరిష్కృతంగా ఉన్నట్లు ఆరోపణలు విన వస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాల వంటి చిన్నపాటి సమస్యలను కూడా నెలల తరబడి అధికారులు పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రజల ప్రదక్షిణలు
అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అవేదన
నల్లచెరువు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక త హసీల్దార్ కార్యాలయంలో ప్రజల సమస్యలు కుప్పలు తెప్పలుగా అపరిష్కృతంగా ఉన్నట్లు ఆరోపణలు విన వస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాల వంటి చిన్నపాటి సమస్యలను కూడా నెలల తరబడి అధికారులు పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో విద్యార్థులు, ప్రజలు, మహిళలు సైతం పదుల సంఖ్యలో ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
హోల్డ్ లోనే సర్వే నంబర్లు
మండలంలోని 13 పంచాయతీల పరిధిలో సుమారు ఆరు వేల మంది రైతులు ఉన్నారు. మండల వ్యాప్తంగా సుమారు కొన్ని వేల ఎకరాలకు సంబంధించి పాస్‌బుక్ సర్వే నెంబర్లను రీ సర్వే పేరుతో అధికారులు హోల్డ్‌లో ఉంచారు. దీంతో రైతులు తా ము బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని రెన్యువల్ చేసుకునేందుకు, తమ వ్యవసాయ పనులు మానుకొని కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.
నిర్లక్ష్యంగా సమాధానాలు
కార్యాలయానికి పలు సమస్యలపై వచ్చే రైతులు, ప్రజలను కనీసం పలకరించి, వారి సమస్యను తెలుసుకునే పరిస్థితిలో కూడా అక్కడి అధికారులు లేరని పలువురు వాపో తున్నారు. అంతేగాకుండా ఇప్పుడు బిజీగా ఉన్నాం... రెండు రోజులు తర్వాత రండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు. దీన్ని అలుసుగా తీసుకున్న కొంతమంది దళారులు రైతుల వద్ద అందినకాటికి నగుదును తీసుకుంటూ, వారి పనులు మాత్రమే చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
అసంతృప్తిగా ఉన్న వీఆర్‌ఓలు
కార్యాలయంలో విధులు నిర్వహించే కొందరు వీఆర్‌ఓలు తహసీల్దార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ లాగిన నుంచి ఒక రోజులోనే పంపిన ధ్రువీకరణ పత్రాలను పై అధికారులు వారి లాగినలలో వారాల తరబడి అప్రూవల్ చేయడం లేదంటున్నారు. దీంతో గ్రామాల్లోకి ప్రజలు తమను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోల్డ్‌లో పెట్టిన 1-బి, అడంగల్ హోల్డ్‌లో నుంచి తొలగించే కీ తహసీల్దార్ తన వద్దే ఉంచుకుని, ఆయన కార్యాలయానికి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఓపెన చేసి ఇవ్వడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వీఆర్‌ఓలు తెలుపుతు న్నారు.
భూమి ఒకరిది- ఆనలైనలో మరొకరి పేరు
మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో సమస్యలు తారా స్థాయికి చేరాయి. భూమి ఒకరిది అయితే ఆనలైనలో మరొకరి పేరు ఉండటంతో ఘర్షణలు పడి పోలీస్ స్టేషనల చుట్టూ తిరుగుతున్నారు. అంతేగాకుండా భూమికి సంబంధించి ఆనలైనలో మరొకరి పేరుమీద పాస్ బుక్ ఉండడంతో పలువురు రైతులు బ్యాంక్‌లలో రుణాలు పొందలేక పోతున్నారని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని పలువురు వాపోతున్నా రు. దీనిపై తహసీల్దార్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు అంటున్నారు. ఇదిలాఉంటే కొన్ని ప్రైవేటు కంపెనీలు కొందరు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమినే కాకుండా పక్కన ఉన్న రైతుల భూములను కూడా ఆ కంపెనీల పేరిట ఆనలైనలో ఎక్కించుకున్నారని, దీనిపై బాధిత రైతులు ఫిర్యాదు చేసినా అఽధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సమ్యలను పరిష్కరిస్తాం : డీటీ
తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ రవినాయక్‌ను వివరణ కోరంగా ... తమ దృష్టికి వచ్చిన రైతుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....