DDO: మెరుగైన సేవల కోసమే డీడీఓలు : కలెక్టర్
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:03 AM
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ(డివిజనల్ అభివృద్ధి అధికారి) కార్యాలయాలను ప్రారంభించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. స్థానిక గ్రామ సచివాలయం-4లో నూతనంగా డీడీఓ కార్యాలయం గురువారం ప్రారంభమైంది.
కొత్తచెరువు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ(డివిజనల్ అభివృద్ధి అధికారి) కార్యాలయాలను ప్రారంభించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. స్థానిక గ్రామ సచివాలయం-4లో నూతనంగా డీడీఓ కార్యాలయం గురువారం ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్ చిత్తూరు జిల్లా నుంచి వర్చ్యువల్ పద్ధతిలో రాష్ట్రంలోని 77 డీడీఓ కార్యాలయాలను గురువారం ప్రారంభించారు. ఈక్రమంలో పుట్టపర్తి డివిజనకు సంబంధించిన డీడీఓ కార్యాలయం ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును ఈ కార్యాలయ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సలో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అధికారులు సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓ నటరాజ్, పీఆర్‌జేఈ నాగరాజు, సచివాలయ సిబ్బంది, ఇతర శాఖా అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....