GOD: ఘనంగా దత్త పౌర్ణమి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:58 PM
పట్టణంలోని సాయినగర్ షిర్డీసాయి మంది రంలో దత్తాత్రేయ జయంతిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో గు రువారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ విగ్ర హానికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తహోమం, సా మూ హిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించా రు. రక్త దాన శిబిరంలో 30 మంది యువకులు రక్త దానం చేశారు. అన్నదానం చేపట్టారు.
ధర్మవరం/రూరల్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సాయినగర్ షిర్డీసాయి మంది రంలో దత్తాత్రేయ జయంతిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో గు రువారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ విగ్ర హానికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తహోమం, సా మూ హిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించా రు. రక్త దాన శిబిరంలో 30 మంది యువకులు రక్త దానం చేశారు. అన్నదానం చేపట్టారు. కొత్తపేట వెంక టేశ్వరస్వామి ఆలయంలోనూ దత్త జయంతిని నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్‌యార్డ్ సమీపం లో ఉన్న రమణ మహర్షి ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఆశ్రమ వ్యవస్థాపకులు చిప్పల వెంకప్ప ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 11గంటలకు అరుణాచలం మహాదీపాన్ని ఆవునేతితో వెలిగించి, అక్షరమణిమాల పారాయణం చేశారు. సత్సంగం నిర్వహించారు. మధ్యాహ్నం నారా యణ సేవ చేపట్టారు. ధర్మవరంరూరల్ మండలం లోని గరుడంపల్లి క్రాస్‌లో ఉన్న కాశీనాయన ఆశ్ర మంలో దత్త పౌర్ణమి ఆరాధనోత్సవాలను నిర్వహిం చారు. కాశీనాయన విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దఎ త్తున స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆశ్రమ నిర్వహకులు కణేకంటి శివారెడ్డి, శంకరచౌడప్ప తదితరులు పాల్గొన్నారు.