WELLS: ప్రమాదకరంగా బావులు
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:48 PM
మండలపరిధిలోని చౌటకుం ట పల్లి నుంచి కదిరి మెయిన రోడ్డుకు లింక్‌రోడ్డు పనులు జరగుతు న్నాయి. ఈ రోడ్డుకు అనుకుని మూడు పాడు బడిన బావులు ఉన్నా యి. ఈ బావుల వద్ద ఎలాంటి రక్షణ గోడలు లేవు. బావుల వద్ద గోడ లు లేకపోవడం వల్ల లింక్ రోడ్డులో వాహనాలు ఎదురెదురుగా వచ్చి నప్పుడు వాహనదారులు ఏమాత్రం పొరపాటుగా వ్యవహరించిని ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.
నల్లమాడ, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని చౌటకుం ట పల్లి నుంచి కదిరి మెయిన రోడ్డుకు లింక్‌రోడ్డు పనులు జరగుతు న్నాయి. ఈ రోడ్డుకు అనుకుని మూడు పాడు బడిన బావులు ఉన్నా యి. ఈ బావుల వద్ద ఎలాంటి రక్షణ గోడలు లేవు. బావుల వద్ద గోడ లు లేకపోవడం వల్ల లింక్ రోడ్డులో వాహనాలు ఎదురెదురుగా వచ్చి నప్పుడు వాహనదారులు ఏమాత్రం పొరపాటుగా వ్యవహరించిని ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. ఎదు రుగా వచ్చిన వాహనానికి దారి ఇచ్చేందుకు ఏ మాత్రం పక్కకు వెళ్లినా రక్షణ గోడలు లేక పోవడం వల్ల ఆ వాహనం రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయే ప్రమాదముందని వాహనదారులు అంటున్నారు. అలాగే ఈ బావుల వద్దే మలుపులు ఉండడంతో ఏదైనా అవసర ని మిత్తం ఒక్కసారిగా బ్రేక్ వేస్తే వాహనం బావిలో పడిపోయే అవకాశ ముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో పరిస్థితి మరింత ప్రమాకరం అంటున్నారు. ఏవైనా వాహనాలు ఎదురుగా వస్తే... పొరపాటున రోడ్డు కిందికి దిగితే బావిలోకి పడాల్సిందే అంటు న్నారు. ఇంత పెద్ద ప్రమాదం ఈ రోడ్డులో పొంచి ఉందని వాపోతు న్నారు. అధికారులు, నాయకులు ఈ రోడ్డు పక్కనున్న బావులను పరి శీలించి, గోడలు నిర్మించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....