Share News

POLE: దెబ్బతిన్న విద్యుత ఇనుప స్తంభాలు

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:45 PM

మండల కేంద్రంలోని కమ్మపాళ్యం ప్రాంతం లో రెండు ఇనుప స్తంభాలు అడుగుభాగాన తుప్పుపట్టాయి. అవి ఏ సమయంలో కూలు తాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం. గాలి, వాన బలంగా వస్తే ఆ స్తంభాలు కూలే అవకాశం ఉందని వాపోతున్నారు. దీంతో ఏ సమ యంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంభయంగా గడుపుతున్నారు.

POLE: దెబ్బతిన్న విద్యుత ఇనుప స్తంభాలు
Iron electric poles ready to fall

వర్షం వస్తే షాక్‌ కొడుతున్నాయి - కమ్మపాళ్యం వాసుల ఆందోళన

ధర్మవరం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కమ్మపాళ్యం ప్రాంతం లో రెండు ఇనుప స్తంభాలు అడుగుభాగాన తుప్పుపట్టాయి. అవి ఏ సమయంలో కూలు తాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం. గాలి, వాన బలంగా వస్తే ఆ స్తంభాలు కూలే అవకాశం ఉందని వాపోతున్నారు. దీంతో ఏ సమ యంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంభయంగా గడుపుతున్నారు. రోజూ ఈ దారివెంట అంగనవాడీ కేంద్రానికి, ప్రాథమిక పాఠశాలకు, ప్రభుత్వ ఆస్పత్రికి చిన్నారులు, వృద్ధులు, మహిళలు, గర్భిణులు వెళ్తుంటారు. పైగా వర్షం కురిసినప్పుడు ఆ విద్యుత స్తం భాలకు కరెంటు సరఫరా అవుతోందని, పొర పాటున చిన్నారులు వాటిని తాకి విద్యుదా ఘాతానికి గురవుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు. ఆ విద్యుతస్తంభాలను మార్చాలని పలుమార్లు ఆ శాఖ అధికా రులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ప్రాణాలు పోతే తప్ప పట్టించుకోరా అంటూ మండిపడుతున్నారు. కూలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత స్తంభాలను మా ర్చాలని కమ్మపాళ్యం వాసులు రెండు నెలల క్రితం ఏఈ వెంకటేశనాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వాటిని పరిశీలించి కొ త్తవి ఏర్పాటుచేస్తామని తెలిపారు. వాటిని మార్చాలని ఆయన అక్కడ పని చేస్తున్న లైన ఇనస్పెక్టర్‌, లైనమ్యానకు చెప్పినా వా రు పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్ప టికైనా విద్యుతశాఖ ఉన్నతాధికారులు స్పం దించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 13 , 2025 | 11:45 PM