Share News

DANCE: శిల్పారామంలో సాంస్కృతిక సంబరాలు

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:52 AM

సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు శిల్పారామంలో వివిధ కళాసంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి అనంతపురానికి చెందిన శ్రీనృత్య కళాని లయం శ్రీమతి సంధ్యామూర్తి కళా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

DANCE: శిల్పారామంలో సాంస్కృతిక సంబరాలు

పుట్టపర్తి టౌన, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు శిల్పారామంలో వివిధ కళాసంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి అనంతపురానికి చెందిన శ్రీనృత్య కళాని లయం శ్రీమతి సంధ్యామూర్తి కళా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చంద్రహాసిని, ప్రణ వ, బబిత, నిఖిత, వేదన్విత, దీక్షిత, హర్షవర్ణ తదితర చిన్నారుల బృందం చేసిన కూచిపూడి భరతనాట్యం, శివపాదం తదితర నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలంకరించాయి. ఈ సందర్భంగా పర్యాటక శాఖ అధికారి నరసయ్య మాట్లాడుతూ... దేశవిదేశాల నుంచి వస్తున్న సాయి భక్త జనులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎం రామ్మోహన, నృత్య కళాకారులు శిల్పారా మం ఏఓ ఖాదర్‌ వలి, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:52 AM