BICYCLES: మూలనపడిన బ్యాటరీ సైకిళ్లు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:28 AM
ప్రభుత్వం భవిత కేంద్రంలోని దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను సరఫరా చేసింది. వాటిని దివ్యాంగులకు పంపిణీ చేయకుండా మండల కేంద్రంలోని బాలుర ఉన్నతపాఠశాల డైనింగ్ హాల్‌లో మూలన పడేశారు. దీంతో అవి ఆ గదిలో పెట్టెలకే పరిమితమయ్యాయి. ఈ సైకిళ్లను ఐదు నెలల క్రితం సరఫరా చేశారు. దీంతో ఒక్కొక్కటి రూ.50 వేలు విలువ చేసే బ్యాటరీ రీచార్జ్ సైకిళ్లు మూలనపడి నిరుప యోగంగా మారుతున్నాయి.
కొత్తచెరువు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం భవిత కేంద్రంలోని దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను సరఫరా చేసింది. వాటిని దివ్యాంగులకు పంపిణీ చేయకుండా మండల కేంద్రంలోని బాలుర ఉన్నతపాఠశాల డైనింగ్ హాల్‌లో మూలన పడేశారు. దీంతో అవి ఆ గదిలో పెట్టెలకే పరిమితమయ్యాయి. ఈ సైకిళ్లను ఐదు నెలల క్రితం సరఫరా చేశారు. దీంతో ఒక్కొక్కటి రూ.50 వేలు విలువ చేసే బ్యాటరీ రీచార్జ్ సైకిళ్లు మూలనపడి నిరుప యోగంగా మారుతున్నాయి. అయితే సంబంధిత కంపెనీ వారు ఆ సైకిళ్లకు బ్యాటరీలు అమర్చడానికి రాకపోవడంతో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయలేకపోతున్నామని భవిత కేంద్రం అధికారి ఆనంద్‌బాబు తెలిపారు. ఈ సైకిళ్లు జిల్లా పరిధిలో కదిరి, చెన్నేకొత్తపల్లి, బత్తలపల్లి మండలాలకు ఒక్కొక్కటి చొప్పున మూడు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. త్వరలోనే కంపెనీ వారికి తెలి యజేసి వాటిని వినియోగంలోకి తెస్తామని, లబ్ధిదారులకు అందజేస్తా మని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....