MLA : ఆలయాల అభివృద్ధికి సహకరిచండి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:28 AM
నియోజకవర్గంలోని పురాత నమైన దేవాలయాల అభి వృద్ధితో పాటు గూగూడు ను పుణ్యక్షేత్రంగా, పర్యా ట క ప్రాంతంగా అభివృద్ధి చే యడానికి నిధులు కేటా యించాలని రాష్ట్ర దేవదా య శాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డికి ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మం త్రిని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

- దేవదాయ శాఖ మంత్రికి ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వినతి
శింగనమల/ బుక్కరాయసముద్రం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని పురాత నమైన దేవాలయాల అభి వృద్ధితో పాటు గూగూడు ను పుణ్యక్షేత్రంగా, పర్యా ట క ప్రాంతంగా అభివృద్ధి చే యడానికి నిధులు కేటా యించాలని రాష్ట్ర దేవదా య శాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డికి ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మం త్రిని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గం లోని నార్పల మండలంలో ఉన్న గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలకు నాలుగు రాష్ర్టాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ, మహారాష్ట్ర, తమిళనాడు) నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి, మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. గూగూడుకు పర్యాటక ప్రాంతంగా పుణ్యక్షేత్రం గా గుర్తింపు ఇవ్యాలన్నారు. అలాగే శింగనమల మండలంలోని పురాతన చర్రిత కలిగి రుషింగమయ్య వెలసిన కొండపైకి సీపీ రోడ్డు వేసి, అక్కడి రుష్యశ్యంగ మునీశ్వర దేవాలయం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. బుక్కరాయసముద్రంలో అతి పురాతణమైన దేవరకొండ మీద వెలిచిన కొండమీద రాయుడు దేవాలయాన్ని పర్యాటక రంగం గుర్తించి, కొండపై టీటీడీ కల్యాణమండపంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలే కొండపైన అరుణాచలం తరహాలో జ్యోతిని వెలిగించామని, వచ్చే ఏడాదికి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించే విధంగా చోరవ చూపాలని మంత్రిని కోరారు. గత వైసీపీ పాలనలో సమీపంలోని ఆ దేవాలయ భూమి అక్రమణకు గురైందన్నారు. దానిని స్వాధీనం చేసుకుని, భక్తుల గిరి ప్రదక్షిణకు సౌకర్య కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే తెలిపారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....