Share News

NMU: కొనసాగిన ఎనఎంయూ ధర్నా

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:59 PM

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎనఎంయూ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రెం డో రోజు బుధవారం కొనసాగింది. డిపో ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎనఎంయూ జిల్లా నాయకులు మోహన, దుర్గాప్రసాద్‌, నాగప్పమాట్లాడుతూ... ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని, తక్షణమే పీఆర్‌సీ కమిషనను ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు.

NMU: కొనసాగిన ఎనఎంయూ ధర్నా
NMU leaders protesting in front of the depot

ధర్మవరం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎనఎంయూ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రెం డో రోజు బుధవారం కొనసాగింది. డిపో ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎనఎంయూ జిల్లా నాయకులు మోహన, దుర్గాప్రసాద్‌, నాగప్పమాట్లాడుతూ... ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని, తక్షణమే పీఆర్‌సీ కమిషనను ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. గవర్నర్‌ పేట-2 డిపోకు చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లులు సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను ఉపసంహరించు కోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను తక్షణమే చెల్లించాలని, రిటైర్‌ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, టెర్మినల్‌ ఎనక్యాష్‌మెంట్‌ తదిత రాలను వెంటనే చెల్లించాలని, దాదాపు ఎనిమిదివేల ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూ ట్మెంట్‌ ద్వారా భర్తీ చేయాలన్నారు. నాలుగేళ్లగా ఆగిపోయిన ప్రమోషన్లను ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిషృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంక్షరక్షణ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు..ఈ ధర్నాలో డిపో నాయకులు హనుమాన, మంజు, రమణప్ప, వైవీఎన రెడ్డి, భాస్కర్‌, కుమార్‌, హరి, పీఎస్‌ఖాన, ఎంసీజీరావు, మాధవ పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:59 PM