GAMES: కొనసాగిన డివిజన స్థాయి క్రీడా పోటీలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:03 AM
ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగిన డివిజన స్థాయి పోటీలను రెండో రోజు గురువారం ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓ బులరెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు స్వరూప అధ్యక్ష త వహించారు. అండర్-14, 17 బాలికల ఖోఖో విన్నర్స్‌గా గాండ ్లపెంట మండలం, రన్నర్స్‌గా కదిరి మండలం జట్లు నిలిచాయి. అండర్ -14, 17 బాలుర ఖోఖో విన్నర్స్‌గా గాండ్లపెంట మండలం జట్లు, అండర్ -14 రన్నర్‌గా తనకల్లు మండలం, అండర్-17 రన్నర్ గా కదిరి మండలం జట్టు నిలిచాయి.
కదిరి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగిన డివిజన స్థాయి పోటీలను రెండో రోజు గురువారం ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓ బులరెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు స్వరూప అధ్యక్ష త వహించారు. అండర్-14, 17 బాలికల ఖోఖో విన్నర్స్‌గా గాండ ్లపెంట మండలం, రన్నర్స్‌గా కదిరి మండలం జట్లు నిలిచాయి. అండర్ -14, 17 బాలుర ఖోఖో విన్నర్స్‌గా గాండ్లపెంట మండలం జట్లు, అండర్ -14 రన్నర్‌గా తనకల్లు మండలం, అండర్-17 రన్నర్ గా కదిరి మండలం జట్టు నిలిచాయి. అండర్-14 బాలురు కబడ్డీ పోట్లీలో విన్నర్స్ కదిరి, రన్నర్స్ ఎనపీకుంట. అండర్ - 17 బాలుర కబాడ్డీలో విన్నర్స్‌గా నల్లచెరువు, రన్నర్స్‌గా కదిరి జట్లు సాధించా యి. అండర్ -14 బాలికల కబడ్డీ విభాగంలో విన్నర్స్‌గా తలుపుల, రన్నర్స్‌గా కదిరి, అండర్ -17లో విన్నర్ ఎనపీకుంట, రన్నర్‌గా నల్ల చెరువు జట్టు సాధించాయి. అండర్ -14 వాలీబాల్ బాలుర విభా గంలో విన్నర్స్‌గా తనకల్లు, రన్నర్స్‌గా కదిరి, అండర్ -14 బాలికల విభాగంలో విన్నర్స్‌గా కదిరి, రన్నర్స్‌గా తలుపుల మండల జట్లు గెలుపొందినట్లు డివిజన కోఆర్డినేటర్ లష్కర్‌నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటాచలం, ఏజీఎఫ్ సెక్రటరీ సుహాసిని, పీడీలు శంకర్‌నాయక్, హరిప్రసాద్ నా యక్, రవీంద్రనాయక్, యశోద, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....