COUNCIL: సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయండి
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:49 PM
సత్యసాయి శతజయంతి ఉత్స వాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కౌన్సిల్ సభ్యులు అధికారు లకు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్మన తుంగ ఓబుళపతి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమా వేశం నిర్వహించారు
కౌన్సిల్ సమావేశంలో సభ్యుల సూచన
పుట్టపర్తి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సత్యసాయి శతజయంతి ఉత్స వాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కౌన్సిల్ సభ్యులు అధికారు లకు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్మన తుంగ ఓబుళపతి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమా వేశం నిర్వహించారు. ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి, కౌన్సిలర్లు జయప్ప, సూర్యగౌడ్, చెరువు భాస్కర్, సాయిగీతతో పాటు పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ... నవంబరులో జరిగే సత్యసాయి జయంతి వేడుకలకు లక్షలాదిమంది భక్తులు రానున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనైజీ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. అలాగే భక్తులకు ప్రభుత్వపరంగా చేయాల్సిన ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే సీసీ రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. పారిశుద్ధ్యం పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. భక్తుల కోసం తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లతో పాటు అపరిశుభ్రత లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో ఏఈ స్వాతి, ఆర్‌ఐ నరసింహులు, సెంట్రింగ్ ఇనస్పెక్టర్ శివయ్య పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....