ROAD: రోడ్డును తవ్వేశారని ఫిర్యాదు
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:09 AM
మండల పరి ధిలోని కేశాపురం గ్రామానికి వెళ్లే బ్రిడ్జి సమీపంలో రోడ్డును వెంకటలక్ష్మమ్మ అనే మహిళ తవ్వేశారంటూ గ్రామస్థులు సోమవారం తహసీల్దార్ బాలాంజినేయులుకు స్థానిక తహసీ ల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ధర్మవ రం ప్రధానరహదారి నుంచి కేశాపురానికి వె ళ్లేందుకు మాజీ మంత్రి పల్లెరఘునాథ రెడ్డి ఆ యన మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రూ.8 కోట్ల తో చిత్రావతి నదిపై బ్రిడ్జితో పాటు తారురోడ్డును వేయించారు.
కొత్తచెరువు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మండల పరి ధిలోని కేశాపురం గ్రామానికి వెళ్లే బ్రిడ్జి సమీపంలో రోడ్డును వెంకటలక్ష్మమ్మ అనే మహిళ తవ్వేశారంటూ గ్రామస్థులు సోమవారం తహసీల్దార్ బాలాంజినేయులుకు స్థానిక తహసీ ల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ధర్మవ రం ప్రధానరహదారి నుంచి కేశాపురానికి వె ళ్లేందుకు మాజీ మంత్రి పల్లెరఘునాథ రెడ్డి ఆ యన మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రూ.8 కోట్ల తో చిత్రావతి నదిపై బ్రిడ్జితో పాటు తారురోడ్డును వేయించారు. దీంతో ఎన్నో ఏళ్లగా ఉన్న రహదారి సమస్య పరిష్కారమైంది. అయితే తారు రోడ్డు నిర్మాణానికి తన భూమి పోయిందని, నష్టపరి హారం ఇవ్వలేదన్న కారణంతో రోడ్డును వెంకట లక్ష్మమ్మ తవ్వేశారని గ్రామస్థు లు తెలిపారు. ఆ భూమి వంకపొరంబోకు కావడంతో ప్రభుత్వం నష్ట పరిహారం ఇ వ్వలేదన్నారు. గ్రామంలోకి వెళ్లే బ్రిడ్జి మలుపువద్ద రో డ్డును తవ్వేయడంతో ప్రమా దాలు జరిగే అవకాశం ఉంద ని వారు తహసీ ల్దార్‌ను కో రారు. ఈ సమస్యను పరి ష్కరించాలని ఆయన వీ ఆర్వో, ఆర్‌ఐ, మండల సర్వేయర్‌ను ఆదేశించారని గ్రామస్థులు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....