ROAD: ప్రయాణికుల నిరసన
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:31 AM
మండల పరిధిలోని వేపరాల వద్ద బస్సులు నిలపడం లేదని పలువురు ప్రయాణికులు ప్రధాన రహదారికి అడ్డంగా రాళ్లు వేసి సోమవారం నిరసన తెలిపారు. కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో పలు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. డ్రైవర్లు నిర్ణీత బస్‌స్టాపులలో సైతం బస్సులను ని లపకుండా వెళుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.
గాండ్లపెంట, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని వేపరాల వద్ద బస్సులు నిలపడం లేదని పలువురు ప్రయాణికులు ప్రధాన రహదారికి అడ్డంగా రాళ్లు వేసి సోమవారం నిరసన తెలిపారు. కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో పలు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. డ్రైవర్లు నిర్ణీత బస్‌స్టాపులలో సైతం బస్సులను ని లపకుండా వెళుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. దీంతో వేపరాల మిట్ట వద్ద ఉన్న బస్టాండు సమీపంలో రహదారిపై రాళ్లు వేసి బస్సులు ఆపే ప్రయత్నం చేశారు. అయినా బస్సులను నిలపకుండ వెళ్లి పోవడంపై అసహనం వ్యక్తం చేస్తు నిరసన చేపట్టారు. గంటల కొద్దీ వేచిఉంటున్నా ఫలితం లేకపోవడంతోనే రహదారికి రాళ్లు అడ్డంగా వేసినట్లు ప్రయాణికులు తెలిపారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని బస్‌స్టాపుల లో బస్సులు నిలిపేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.