MLA: సమస్యలు తెలుసుకునేందుకే మీ వద్దకు
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:03 AM
ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి మీ ఇంటివద్దకే వచ్చామని ఎ మ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలపరిధిలోని గోవిం దురాజులపల్లిలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన ప్రతి ఇంటివద్దకు వెళ్లి పింఛనదారుల యోగక్షేమాలు తెలుసుకుని పింఛన్లు అందించారు.
పింఛన పంపిణీలో ఎమ్మెల్యే కందికుంట
నంబులపూలకుంట, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి మీ ఇంటివద్దకే వచ్చామని ఎ మ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలపరిధిలోని గోవిం దురాజులపల్లిలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన ప్రతి ఇంటివద్దకు వెళ్లి పింఛనదారుల యోగక్షేమాలు తెలుసుకుని పింఛన్లు అందించారు. పలువురు పలు సమస్యలపై ఆర్జీలు అందించారు. ఇళ్లు లేనివారం పక్కాగృహాలు మంజూరు చేయాలని తహసీల్దార్ దేవేంద్రనాయక్‌కు సూచించారు. గ్రామంలో నిర్మించిన ఆర్వోప్లాంటును, ధనియానచెరువు అంగనవాడీ కేంద్రం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే రైతన్నా మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ధనియానచెరువు రైతు సేవా కేంద్రంలో రబీ విత్తన వేరుశనగను పంపిణీ చేశారు. అలాగే మండ లంలోని సోమరాజుకుంట గ్రామ సమీపంలో మైనింగ్ పనులను పెద్ద పెద్ద యంత్రాలతో చేస్తున్నారని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళా ్లరు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏపని అయినా నిలిపివేయాలని తహసీల్దార్ దేవేంద్రనాయక్‌కు ఆయన సూచించారు. టీడీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌నాయుడు, నాయకులు దండే రవి, నరసింహులు, సర్పంచ శ్రీహరిశర్మ, రామాంజులు, ఆంజనప్పనా యుడు, తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఎంపీడీఓ పార్థసారఽథి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....