Share News

TDP: సూపర్‌హిట్‌ సభకు తరలిరండి

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:25 PM

అనంతపురంలో బుధవారం నిర్వహించే సూపర్‌సిక్స్‌- సూపర్‌హిట్‌ సభకు పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ నాయకులు పిలుపు నిచ్చారు. తెలుగుమహిళలు మంగళవారం 33వ వార్డులో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానించారు. స్ర్తీశక్తి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌, ఉచిత బస్సు ప్రయాణం పథకాలతో ప్రతి మహిళ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.

TDP: సూపర్‌హిట్‌ సభకు తరలిరండి
Telugu women and TDP leaders inviting in 33rd ward

- తెలుగు మహిళల పిలుపు

ధర్మవరం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో బుధవారం నిర్వహించే సూపర్‌సిక్స్‌- సూపర్‌హిట్‌ సభకు పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ నాయకులు పిలుపు నిచ్చారు. తెలుగుమహిళలు మంగళవారం 33వ వార్డులో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానించారు. స్ర్తీశక్తి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌, ఉచిత బస్సు ప్రయాణం పథకాలతో ప్రతి మహిళ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం చంద్ర బాబు వస్తున్న సూపర్‌హిట్‌ సభకు మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోసల శ్రీరాములు, పూజామొబైల్‌ సాయి, మార్కెట్‌ రహీం తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 09 , 2025 | 11:26 PM