COLLECTOR: శిల్పగురు అవార్డు గ్రహీతకు కలెక్టర్ సత్కారం
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:44 PM
భారతీయ ప్రాచీన సంప్రదాయ కళ అయిన తోలుబొమ్మల తయారీ కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం శ్రీసత్యసాయి జిల్లాకు గర్వకారణమని ్ల కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రా మానికి చెందిన తోలుబొమ్మల తయారీ కళాకారిణి శివమ్మ డిసెంబరు 9న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ శిల్పగురు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.
పుట్టపర్తి టౌన, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): భారతీయ ప్రాచీన సంప్రదాయ కళ అయిన తోలుబొమ్మల తయారీ కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం శ్రీసత్యసాయి జిల్లాకు గర్వకారణమని ్ల కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రా మానికి చెందిన తోలుబొమ్మల తయారీ కళాకారిణి శివమ్మ డిసెంబరు 9న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ శిల్పగురు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను అవార్డు గ్రహీత శివమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కలెక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భావితరాలకు ఈ ప్రాచీన కళను అందించడమే తన జీవిత లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.