Share News

TDP: ఉమ్మడి రాష్ట్రంపై సీఎం చెరగని ముద్ర

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:57 PM

ఉమ్మడి ఆంద్రప్రదేశపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెరగని ముద్ర వేశారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా పదవి చేపట్టి 30 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అనంతపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సంబరాలు చేసుకున్నారు.

TDP: ఉమ్మడి రాష్ట్రంపై సీఎం చెరగని ముద్ర
TDP leaders feeding cake to Paritala Sriram

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంద్రప్రదేశపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెరగని ముద్ర వేశారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా పదవి చేపట్టి 30 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అనంతపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌కట్‌ చేసి స్వీట్లను తినిపించుకున్నారు. కంగ్రాట్స్‌ సీఎం సార్‌ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గ కార్యకర్తల తరపున పరిటాల శ్రీరామ్‌ చంద్రబాబునాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంత రం పరిటాలశ్రీరామ్‌ మాట్లాడుతూ... రాజకీయాల్లో రాణించడం కష్టంగా ఉన్న ఆ రోజుల్లోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక రోల్‌ మోడల్‌గా నిలిచారన్నారు. ఆ రోజు హైటెక్‌ సిటీ నుంచి నేటి అమరావతి, పీ4వరకు ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రతిదీ సంచలన మే అన్నారు. విమర్శలు చేసిన నోళ్లు మూతపడేలా ఆయన పాలన సాగించి చూపించారన్నారు. ఆయన విద్యార్థి దశ నుంచి సాగించిన ప్రయాణం యువతకు ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ క్లస్టర్‌ ఇనచార్జ్‌ చింతలపల్లి మహేశచౌదరి, నాయకులు గొట్లూరు శీన, భీమనేని విజయసారథి చౌదరి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 01 , 2025 | 11:57 PM