WASTE: మూలన పడ్డ స్వచ్ఛ వాహనాలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:36 PM
మండల వ్యాప్తంగా పలు పంచాయతీల్లో స్వచ్ఛ సంకల్పం సైకిళ్లు తుప్పు పడుతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించు కోవడం లేదు. మండలంలోని 14 పంచాయతీలలో ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత, స్వచ్ఛ సంకల్పం అనే ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. అయితే పలు పంచాయతీల్లో వాటి ని వినియోగంచడం అంతంత మాత్రంగానే ఉండటంతో మూలన పడివేశారు.
పట్టించుకోని పాలకులు, అధికారులు
గాండ్లపెంట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా పలు పంచాయతీల్లో స్వచ్ఛ సంకల్పం సైకిళ్లు తుప్పు పడుతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించు కోవడం లేదు. మండలంలోని 14 పంచాయతీలలో ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత, స్వచ్ఛ సంకల్పం అనే ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. అయితే పలు పంచాయతీల్లో వాటి ని వినియోగంచడం అంతంత మాత్రంగానే ఉండటంతో మూలన పడివేశారు. వాటికి ఏర్పడిన చిన్నపాటి మరమ్మతులను కూడా చేయిం చకపోవడంతో తుప్పు పడుతున్నాయని ప్రజలు అంటున్నారు. మండ లంలో ఎన్ని వాడకంలో ఉన్నాయనే విషయం కూడా పర్యవేక్షణ అధికా రులు మరిచిపోయారనే విమర్శలు వినవస్తున్నాయి. ఆయా పంచా యతీలకు సంబంధించిన సర్పంచలు కూడా వాటి మరమ్మతుల కోసం కనీసం రూ. 100 ఖర్చు చేసిన దాఖలాలు లేవని అంటున్నారు. గ్రా మాలలో నిత్యం చెత్తను సేకరించేందుకు ఉపయోగించాల్సిన స్వచ్ఛ సంకల్పం ట్రైసైకిళ్లను పలుచోట్ల పంచాయతీ కార్యాలయాల ఎదుటే వదిలేయడంతో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఇలా ప్రజాధనం ఎంత వృధా అవుతోందో అంటూ విమర్శలు చేస్తున్నారు.. అధికారులు ఇప్పటికైనా స్పందించి చిన్న చిన్న మరమ్మతులు చేయించి మూలన పడేసిన స్వచ్ఛ సంకల్పం సైకిళ్లను వినియోగం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....